Pamidi: పామిడిలో ఘనంగా వైఎస్సార్‌సీపీ నేత వెంకట గుప్తా బర్త్‌డే వేడుకలు
Pamidi: పామిడి మండల వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు వెంకట గుప్తా జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
Pamidi: పామిడిలో ఘనంగా వైఎస్సార్‌సీపీ నేత వెంకట గుప్తా బర్త్‌డే వేడుకలు
పామిడి: వైఎస్సార్‌సీపీ పామిడి మండల యువ నాయకుడు వెంకట గుప్తా జన్మదిన వేడుకలను పామిడి పట్టణంలోని శ్రీ సాయి ఫర్టిలైజర్ షాప్ వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, యువకులు, అభిమానులు కేక్ కట్ చేసి వెంకట గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి తనయుడు తేజేశ్వర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి మురళి నాయక్, పామిడి వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు స్వామి నాయక్, బీసీ సెల్ సీనియర్ నాయకులు చుక్కల సూరి, రమేష్ నాయక్‌తో పాటు పామిడి వైఎస్సార్‌సీపీ యువ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




