Dharmavaram: పిడుగుపాటుకు 21 గొర్రెలు మృతి..బాధిత రైతును పరామర్శించిన టీడీపీ నేతలు!

Dharmavaram: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మల్కాపురంలో పిడుగుపాటుకు 21 గొర్రెలు మృతి. రైతు విజయ్‌కుమార్‌ను పరామర్శించిన టీడీపీ నాయకులు.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 1 Oct 2026 2:00 PM IST
Dharmavaram
X

Dharmavaram: పిడుగుపాటుకు 21 గొర్రెలు మృతి..బాధిత రైతును పరామర్శించిన టీడీపీ నేతలు!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మల్కాపురంలో నిన్న సాయంత్రం పిడుగుపాటుకు రైతు బిల్లే విజయ్‌కుమార్ కు చెందిన 21 గొర్రెలు మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ విచారం వ్యక్తం చేశారు.బాధిత రైతును పరామర్శించి నష్టాన్ని అంచనా వేయాలని టీడీపీ నాయకులకు ఆదేశాలిచ్చారు.

శ్రీరామ్ ఆదేశాలతో నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జి మహేష్ చౌదరి టీడీపీ నాయకుడు గొట్లూరు శ్రీనివాసులు, ధర్మవరం పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్ తదితరులు వెళ్లి బాధిత రైతు విజయ్ కుమార్ ను పరామర్శించారు.ఘటనలో జరిగిన నష్టాన్ని వివరాలను తెలుసుకుని ఇంచార్జ్ శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధిత రైతుకు అందాల్సిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని పరిటాల శ్రీరామ్ సైతం హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM