Guntakal: గుంతకల్లు సెయింట్ పీటర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి..PDSU!

Guntakal: గుంతకల్లులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సెయింట్ పీటర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 8 Oct 2026 12:34 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లు సెయింట్ పీటర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి..PDSU!

Guntakal: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంతకల్లు పట్టణంలోని సెయింట్‌ పీటర్‌ పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం పాఠశాల ఎదుట PDSU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా PDSU నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు బి. రాజేష్‌ మాట్లాడుతూ.. పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాలకు ఉన్న అనుమతులు, నిబంధనలకు సంబంధించిన వివరాలను అడిగేందుకు విద్యార్థి సంఘం నాయకులు వెళ్లిన సమయంలో అధికారుల నుంచి తమకు ఫోన్‌ చేసి పాఠశాల ప్రాంగణంలోకి వెళ్లవద్దని చెప్పడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని PDSU నాయకులు కోరారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహణ జరుగుతున్నట్లు తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

అలాగే పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని PDSU నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో PDSU గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు పి. కమల్‌, కార్యదర్శి తలారి సాయి, పట్టణ నాయకులు అజయ్‌, శరత్‌, కార్తీక్‌, అంజి, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL