Guntakal: గుంతకల్లు ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా

Guntakal: నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా హాస్టళ్లు నడుపుతున్న సక్సెస్, పల్లవి స్కూళ్లపై చర్యలకు డిమాండ్.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 1 Jun 2026 3:11 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లు ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా

గుంతకల్లు: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి.డి.ఎస్.యు నియోజకవర్గ కార్యదర్శి వి.వినోద్ మాట్లాడుతూ గుంతకల్ పట్టణంలో రాజేంద్రనగర్ లో సక్సెస్ హై స్కూల్, అదేవిధంగా కసాపురం రోడ్డు నందు పల్లవి హై స్కూల్ లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇలాంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ స్ట్రక్చర్ లేకుండా ఒకే బిల్డింగ్ లోనే బాల,బాలికలకు హాస్టల్స్ ను నిర్వహించుకొని.

వేలకు వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ అదే విధంగా ఆ యొక్క హాస్టల్స్ లో సరైనటువంటి ఫుడ్డు కూడ నిర్వహించుకోకుండా. విద్యార్థి విద్యార్థులను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వేళ్ళకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తు. అక్రమంగా హాస్టల్స్ నిర్వహించుకొని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కినటువంటి సక్సెస్,పల్లవి హై స్కూల్ పైన తక్షణమే చర్యలు తీసుకొని.

అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా పల్లవి,సక్సెస్ ప్లే హై హై స్కూల్స్ లో నిర్వహించుకున్న హాస్టల్స్ ను వెంటనే సీట్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో నా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పి.డి.ఎస్.యు నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు బి.రాజేష్ పి.డి.ఎస్.యు పట్టణ నాయకులు సాయి, ప్రభాస్, కమల్, అరవింద్,రోహిత్,వినయ్, పవన్, సంతోష్,తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story