Peddavaduguru: వీరభద్ర స్వామి ఆలయంలో భాగవత సప్తాహ మహోత్సవం!

Peddavaduguru: అనంతపురం జిల్లా పెద్దవడుగురు తంబళ్లపల్లి పొలిమేరల్లోని వీరభద్ర స్వామి ఆలయంలో ఈనెల 24 నుంచి భాగవత సప్తాహం. భక్తులకు అన్నదాన సౌకర్యం.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 21 Aug 2026 1:17 PM IST
Peddavaduguru
X

Peddavaduguru: వీరభద్ర స్వామి ఆలయంలో భాగవత సప్తాహ మహోత్సవం!

Peddavaduguru: పెద్దవడుగురు సమీపంలోని తంబళ్లపల్లి పొలిమేరల్లో కొలువై ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో భాగవత సప్తాహ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

ఈనెల 24వ తేదీ సోమవారం నుండి వారం రోజుల పాటు ఈ మహోత్సవం జరగనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు భగవద్గీత పారాయణం, అనంతరం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పండితులచే భాగవత పారాయణం నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.

ఈ సప్తాహ మహోత్సవానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ వారు కోరారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story