Lepakshi: లేపాక్షి శిల్పకళా వైభవానికి పేజావర్ స్వామీజీ ప్రశంసల జల్లు!

Lepakshi: శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయాన్ని పేజావర్ మఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ సందర్శించారు.

RAMANJANEYULU, HINDUPUR
Published on: 19 Nov 2026 7:13 AM IST
Lepakshi
X

Lepakshi: లేపాక్షి శిల్పకళా వైభవానికి పేజావర్ స్వామీజీ ప్రశంసల జల్లు!

Lepakshi: అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నిర్వహించిన పేజావర్ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ లేపాక్షి పర్యటన.చారిత్రక వీరభద్ర స్వామి ఆలయంలో స్వామీజీకి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన వేద పండితులు. విజయనగర సామ్రాజ్య శిల్పకళా వైభవానికి అద్దం పట్టిన లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన స్వామీజీ.

ఒకే పైకప్పుపై ఇంతటి అద్భుతమైన దేవతామూర్తుల శిల్పాలను ఎక్కడా చూడలేదంటూ ప్రశంసలు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అద్భుత శిల్ప సంపదను చూసి ముగ్ధులైన పేజావర్ స్వామీజీ. అలనాటి శిల్పులు రాతిలో చెక్కిన కళా నైపుణ్యం అద్భుతమంటూ ప్రత్యేక అభినందనలు.

ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వామి, రఘునాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వామీజీ. లేపాక్షి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని కొనియాడిన పేజావర్ స్వామీజీ.

RAMANJANEYULU, HINDUPUR

RAMANJANEYULU, HINDUPUR