Anantapur :అనంతపురంలో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ!
Anantapur: రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు.
Anantapur :అనంతపురంలో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ!
అనంతపూర్: ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ జరుగుతోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.
అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు పింఛన్లు అందిస్తున్నారని ఆయన తెలిపారు.అనంతపురం నగరంలో పింఛన్ల పంపిణీ పండుగలా సాగింది.
అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఇంటింటికీ వెళ్తూ లబ్ధిదారులను కలుసుకున్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తూ.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 1వ తేదీ ఆదివారం వస్తే.. ఒక రోజు ముందే పింఛన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
తొలి రోజే ఏకంగా 95 శాతం మందికి పింఛన్లు అందుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
గతంలో జగన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్లారు.
కానీ సీఎం చంద్రబాబు నాయుడు తన అనుభవంతో కేవలం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచాం. జిల్లాలో ప్రతి నెల రూ.
124 కోట్లు, కేవలం అనంతపురం అర్బన్ పరిధిలోనే 22 వేల మంది లబ్ధిదారుల కోసం రూ. 12 కోట్లు పింఛన్ల రూపంలో ఇస్తున్నాం. ఏడాదికి పింఛన్ల కోసమే ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తోంది.
ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగానే అనంతపురం నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రూ. 160 కోట్లతో అధునాతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాన్ని చేపడుతున్నాం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను లబ్ధిదారుల దరిచేర్చడమే కాకుండా.. నగరాభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఏపీ ముందుకు సాగుతోందని స్థానిక నేతలు స్పష్టం చేస్తున్నారు.




