Penukonda: పెనుకొండలో ఘోర ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం!

Penukonda: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని పులేకమ్మ గుడి వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

K.UDAY BHANU, PENUKONDA
Updated on: 25 May 2026 12:08 PM IST
Penukonda
X

Penukonda: పెనుకొండలో ఘోర ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం!

శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ మండలంలోని పులేకమ్మ గుడి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న బంగాళదుంపల లారీని గోధుమల లోడుతో వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. మంటలు భారీగా చెలరేగడంతో గోధుమల లారీ దగ్ధమైంది. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ కిరణ్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతుడు ఆదిలాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.


K.UDAY BHANU, PENUKONDA

K.UDAY BHANU, PENUKONDA

Next Story