Penukonda: హనుమాన్ శోభాయాత్రను ఒక పండుగలాగా జరుపుకుందాం

Penukonda: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జూన్ 7 ఆదివారం నాడు హనుమాన్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

K.UDAY BHANU, PENUKONDA
Published on: 5 Jun 2026 8:51 PM IST
Penukonda
X

Penukonda: హనుమాన్ శోభాయాత్రను ఒక పండుగలాగా జరుపుకుందాం

Penukonda: పెనుకొండ జూన్ 7 ఆదివారం న అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర 44వ జాతీయ రహదారి వద్ద ఉన్న వైస్ జంక్షన్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు హనుమాన్ శోభాయాత్ర భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని శోభ యాత్ర కమిటీ నాయకులు వేద వ్యాస్, రాము, రవి తదితరులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాశి విశ్వేశ్వర ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనుకొండలో శోభాయాత్ర కార్యక్రమం చేపడుతున్నామని ముఖ్య అతిథిగా వక్త కరుణాకర్ సుగ్గున హాజరవుతారన్నారు ఈ కార్యక్రమం వై జంక్షన్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు జరుగుతుందని అనంతరం జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వక్త కరుణాకర్ సుగ్గన ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారన్నారు.

అనంతరం మొక్కలు నాటే ప్రక్రియ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తమిళనాడు, కర్ణాటక , తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి భారీ ఎత్తున భక్తాదులు వస్తున్నారని భక్తాదులకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని కావున ఈ కార్యక్రమాన్ని పెనుకొండ ప్రజలు కలిసి జయప్రదం చేయవలసిందిగా హనుమాన్ కమిటీ నాయకులు పేర్కొన్నారు.

హనుమాన్ శోభాయాత్ర కమిటీ అధ్యక్షుడు వేద వ్యాస్ స్వామి, సెక్రటరీ మురళి, కోశాధికారి మారుతి రెడ్డి, సభ్యులు రాము, రవీంద్రనాథ్, వెంకటరత్నం, త్రినాథ్, యతిరాజ్, శ్రీనాథ్, జయ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసులు, ఉదయభాను, కిరణ్, నారాయణమూర్తి, భాస్కర్ నాయక్, కృష్ణ, శంకర్ రెడ్డి, శ్రీరాములు, రంగనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

K.UDAY BHANU, PENUKONDA

K.UDAY BHANU, PENUKONDA

Next Story