Penukonda: గొల్లపల్లి మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి సవిత!
Penukonda: గొల్లపల్లి రిజర్వాయర్ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు మహిళల కుటుంబాలను పెనుకొండ ఆసుపత్రిలో మంత్రి సవిత పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Penukonda: గొల్లపల్లి మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి సవిత!
పెనుకొండ: గొల్లపల్లి రిజర్వాయర్లో మునిగి ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పెనుకొండ దర్గా పేట ఇసకవంక ప్రాంతానికి చెందిన అశ్విని (20), గాయత్రి (45), పుష్ప (35), మనిన్ (16), హాసిన్ (48) ఈ ఘటనలో మృతి చెందారు..విహారయాత్ర విషాదాంతంగా మారడంతో రాష్ట్ర మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సంతోషంగా గడపాల్సిన సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, మంత్రి సవిత అక్కడికి చేరుకుని మృతదేహాలకు నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




