Penukonda: పెనుకొండలో ప్రజల సమస్యలు విన్న మంత్రి సవితమ్మ

Penukonda: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ. ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ.

K.UDAY BHANU, PENUKONDA
Published on: 13 Aug 2026 5:10 PM IST
Penukonda
X

Penukonda: పెనుకొండలో ప్రజల సమస్యలు విన్న మంత్రి సవితమ్మ

పెనుకొండ: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు, ప్రజలు, కార్యకర్తలు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతులు సమర్పించారు.

ప్రజలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, స్థానిక సమస్యలను మంత్రి సవితమ్మ విని, ప్రతి సమస్యపై సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ప్రజల నుంచి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అర్హత మేరకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకోవడం, కూటమి ప్రభుత్వం లక్షమని మంత్రి సవిత తెలిపారు.

K.UDAY BHANU, PENUKONDA

K.UDAY BHANU, PENUKONDA

Next Story