Penukonda: పెనుకొండలో వైఎస్సార్‌సీపీ సమావేశం: లోకేష్ రాజీనామా డిమాండ్
Penukonda: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో వైఎస్సార్‌సీపీ టౌన్ హాల్ సమావేశం. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్.
Penukonda: పెనుకొండలో వైఎస్సార్‌సీపీ సమావేశం: లోకేష్ రాజీనామా డిమాండ్
జిల్లా Sri Sathya Sai District
పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిరుద్యోగులు, యువత, పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన శ్రీమతి ఉషశ్రీ చరణ్
⚫ డీఎస్సీ–2025 స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి.
⚫ లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి.
⚫ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి.
⚫ సూపర్ సిక్స్ హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి అందించాలి.
⚫ ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించబడతాయి.
⚫ ఆగస్టు 10వ తేదీన నియోజకవర్గ కేంద్రంలో డీఎస్సీ బాధితులకు అండగా, నారా లోకేష్ రాజీనామా కోరుతూ, విద్యార్థులకు మద్దతుగా యువత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, డీఎస్సీ–2025 లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నెలకు ₹3,000 భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారి పక్షాన నిలుస్తూ పెనుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి ఉషశ్రీ చరణ్ సారథ్యంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ, డీఎస్సీ–2025 పేరిట నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని, అందుకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత, వారి తల్లిదండ్రులు, ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, కేంద్రంలో నీట్ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యత వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన విధంగానే, రాష్ట్రంలో డీఎస్సీ స్కాంపై బాధ్యత వహిస్తూ నారా లోకేష్ కూడా తక్షణమే రాజీనామా చేయాలని సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది.




