Penukonda: మంత్రి సవితమ్మ సమక్షంలో టీడీపీలో చేరికలు!

Penukonda: పెనుకొండ మునిమడుగు గ్రామానికి చెందిన 35 వైసీపీ కుటుంబాలు మంత్రి సవితమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. కూటమి అభివృద్ధికి ఆకర్షితులై వలసలు.

K.UDAY BHANU, PENUKONDA
Updated on: 19 July 2026 1:33 PM IST
Penukonda
X

Penukonda: మంత్రి సవితమ్మ సమక్షంలో టీడీపీలో చేరికలు!

Penukonda: పెనుకొండ మండలం మునిమడుగు గ్రామానికి చెందిన 35 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవితమ్మ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.పెనుకొండ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సవితమ్మ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ఆ అభివృద్ధిని చూసి అన్ని వర్గాల ప్రజలు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని, పార్టీ బలోపేతానికి అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

K.UDAY BHANU, PENUKONDA

K.UDAY BHANU, PENUKONDA

Next Story