Anantapur: మళ్లీ పాత రోజులు వచ్చేశాయి.. ఆటోను ఎద్దుల బండికి కట్టి ఊరేగింపు!

Anantapur: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్రోల్‌పై ₹3.30, డీజిల్‌పై ₹3.14 పెంచడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 16 May 2026 9:59 AM IST
Anantapur
X

Anantapur: మళ్లీ పాత రోజులు వచ్చేశాయి.. ఆటోను ఎద్దుల బండికి కట్టి ఊరేగింపు!

Anantapur: కేంద్రంలోని NDA ప్రభుత్వం పెట్రోల్‌పై ₹3.30, డీజిల్‌పై ₹3.14 పెంచడం ప్రజలపై మరో భారంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్క పైసా కూడా పెంచబోమని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు హామీలు ఇచ్చారని, ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచడం ప్రజలకు నమ్మక ద్రోహమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేయించుకోవడం పూర్తయ్యాక సామాన్య ప్రజలపై భారం మోపడం కేంద్ర ప్రభుత్వ అసలు వైఖరిని బయటపెడుతోందన్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులను సాకుగా చూపిస్తూ ఇంధన ధరలను పెంచడం వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా ఛార్జీలు, కూరగాయలు, ఇతర అవసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను వెనక్కి తీసుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎద్దుల బండికి ఆటోను కట్టి నిరసన తెలియజేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story