Puttaparthi: ప్రజల నుంచి 438 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ శ్యాంప్రసాద్

Puttaparthi: పుట్టపర్తి రెవెన్యూ భవనంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (స్పందన) కార్యక్రమంలో కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ప్రజల నుండి 438 అర్జీలను స్వీకరించారు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 6 July 2026 5:20 PM IST
Puttaparthi
X

Puttaparthi: ప్రజల నుంచి 438 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ శ్యాంప్రసాద్

పుట్టపర్తి: ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు.

సోమవారం పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను కలెక్టర్ స్వీకరించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇవాళ మొత్తం 438 అర్జీలు రాగా వాటిపై తగు చర్య తీసుకొని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఎండార్స్ చేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య,bఎస్‌డిసి విజయ కుమారి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story