Anantapur: అనంతపురం మండలంలో ప్రశాంతంగా ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్!

Anantapur: అనంతపురం రూరల్ మండలంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభం. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఓటింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 26 Nov 2026 9:08 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురం మండలంలో ప్రశాంతంగా ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్!

Anantapur: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. అనంతపురం రూరల్ మండల పరిధిలోని రుద్రంపేట పంచాయతీ, రాజీవ్ కాలనీ, కొడిమి, రాచానపల్లి గ్రామ ప్రాంతాల్లో ఓటు వేయటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి గ్రామ సర్పంచ్ గెలుపు ఎవరనేది వెంటనే ప్రకటిస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

144 సెక్షన్ అమలులో ఉందంటూ పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే తనిఖీలు చేసి పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ప్రజలు ఉదయమే పోలింగ్ కేంద్రానికి తరలివస్తు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM