Gooty: గుత్తిలో చోరీకి యత్నించిన మైనర్‌ను పట్టుకున్న స్థానికులు!

Gooty: గుత్తి మార్కెట్‌లో న్యాయవాది జేబు కట్ చేసి ఐఫోన్, నగదు చోరీకి యత్నించిన దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 14 Sept 2026 6:54 AM IST
Gooty
X

Gooty: గుత్తిలో చోరీకి యత్నించిన మైనర్‌ను పట్టుకున్న స్థానికులు!

Gooty: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వినాయక చవితి సందర్భంగా గుత్తి పట్టణంలోని మార్కెట్‌లో నెలకొన్న రద్దీని ఆసరాగా చేసుకుని ఓ జేబుదొంగ చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. మార్కెట్‌లో షాపింగ్‌ చేస్తున్న ప్రజలను లక్ష్యంగా చేసుకున్న దొంగ.. న్యాయవాది తిమ్మారెడ్డి జేబును కట్‌ చేసి, అందులో ఉన్న నగదుతో పాటు విలువైన ఐఫోన్‌ను అపహరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

అయితే అప్రమత్తమైన తిమ్మారెడ్డి వెంటనే దొంగను గుర్తించి పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో స్థానికులు అతడిపై దేహశుద్ధి చేసినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మైనర్‌గా చెబుతున్న అనుమానితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా మార్కెట్‌లో భారీగా రద్దీ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL