Kadiri: కదిరిలో ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు.. శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నేతలు.
Kadiri: కదిరిలో ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కదిరిలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేరున ప్రత్యేక అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారతదేశానికి నరేంద్ర మోదీ అందిస్తున్న సేవలు మరింత కాలం కొనసాగాలని, దేశ ప్రజలకు నిరంతరం సేవలందించే శక్తిని స్వామివారు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ బీజేపీ కదిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఎం.ఎస్. పార్థసారథి స్వామివారిని ప్రార్థించారు.
అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “ఆశీర్వాద దీపం – మన ఇంట్లో ఒక దీపం, ఒక ఆశీర్వాదం” కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, తమ ఆశీర్వాదాలను నరేంద్ర మోదీకి అందించాలని పిలుపునిస్తూ బీజేపీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్, హాస్పిటల్ బోర్డు డైరెక్టర్ శ్రీ సామల కేశవ రెడ్డి, బీజేపీ కదిరి పట్టణ అధ్యక్షులు పిట్ల రామకృష్ణ, జిల్లా కార్యదర్శి శ్రీ రమేష్ బాబు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి కృష్ణవేణి, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు శ్రీ జయరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు క్రిష్టప్ప, ఆవుల శంకర, యువమోర్చా రాష్ట్ర నాయకులు శ్రీ హరి నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీ బుడగల హరీష్ బాబు, రిహానా, పూజ, మధు, వాల్మీకి హరి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.




