Kadiri: మోటర్ సైకిల్ వీలింగ్ /బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న యువకులు అరెస్ట్

Kadiri: కదిరిలో బైక్ ఫీట్లు, రేసింగ్‌లకు పాల్పడుతున్న 25 మంది యువకులను గుర్తించిన పోలీసులు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంపై హెచ్చరిక.

P.RAHAMTULLA, KADIRI
Published on: 5 Jun 2026 1:17 PM IST
Kadiri
X

Kadiri: మోటర్ సైకిల్ వీలింగ్ /బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న యువకులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రమాదకరమైన బైక్ ఫీట్లు,బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న 25 మంది యువకులను గుర్తించి,వారిలో నలుగురిపై కేసులు నమోదు చేసి,మిగతా వారి ఆచూకీ కోసం ప్రత్యేక టీములు ఏర్పాటుచేశారు కదిరి పోలీసులు.

పట్టణానికి చెందిన కొంతమంది యువకులు ప్రమాదకరమైన బైక్ ఫీట్లు నిర్వహిస్తూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ పోలీసులకు చిక్కారు.

తల్లిదండ్రులు తమ పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకుండా వారి అవసరానికి మించిన డబ్బులు ఇవ్వడంతో ఇలాంటి ప్రమాదకర ఫీట్లు చేసి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశముందని పిల్లల తల్లిదండ్రులకు పోలీసులు హెచ్చరించారు.

బైక్ ఫీట్లు, బైక్ రేసింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story