Madakasira: మడకశిరలో పోలీసుల పంజా.. జూదగాళ్ల ఆటకట్టు!
Madakasira: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో జూద స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
Madakasira: మడకశిరలో పోలీసుల పంజా.. జూదగాళ్ల ఆటకట్టు!
శ్రీ సత్య సాయి జిల్లా: మడకశిర రూరల్ సీఐ రాజకుమార్ ఆధ్వర్యంలో, మడకశిర సీఐ, ఐడీ పార్టీ, గుడిబండ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా రాళ్లపల్లి శివారులో జూదం నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.52,000 నగదు మరియు 05 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన సమయంలో ఈరన్న, విజయ్ కుమార్, కృష నాయక్, మంజు, సోము, రమేష్, ఈశ్వరప్ప, శివప్ప, రంగనాథ్, హనుమంతు, చంద్రశేఖర్, తిమ్మ, బలరాం, లక్ష్మీకాంత్ తదితరులు పరారయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం, పరారీలో ఉన్న ఈరన్న ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరిస్తుండగా, శశి, నాగరాజు, కృష్ణ నాయక్ జూదానికి ఫైనాన్స్ అందిస్తున్నట్లు గుర్తించారు. వీరంతా కలిసి ముందుగానే నిర్ణయించిన ప్రదేశాలకు ఆటగాళ్లను రప్పించి ప్రతిరోజూ జూద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.




