Hindupur: భారీగా రేషన్ బియ్యం పట్టివేత ఐచర్ వాహనం సీజ్ డ్రైవర్ అరెస్ట్
Hindupur: హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 16 టన్నుల పీడీఎస్ (PDS) రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
Hindupur: భారీగా రేషన్ బియ్యం పట్టివేత ఐచర్ వాహనం సీజ్ డ్రైవర్ అరెస్ట్
హిందూపురం: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ పౌర సరఫరాల (PDS) బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ C. ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక దాడి నిర్వహించి 16 టన్నుల పిడిఎస్ పట్టుకోవడం జరిగిందని హిందూపురం రూరల్ ఆఫ్ గ్రేడ్ హిందూపురం మండలం మనేసముద్రం గ్రామ పరిసర ప్రాంతంలో కాపు కాసి తనిఖీలు చేపట్టగా, ఐచర్ వాహనం నంబర్ AP-39-TN-3414 లో తరలిస్తున్న భారీ మొత్తంలో PDS బియ్యాన్ని గుర్తించారు. పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ హారతి గారు మరియు VROల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బియ్యం వివరాలు:
50 కేజీల బియ్యం సంచులు – 294
25 కేజీల బియ్యం సంచులు – 52
మొత్తం బియ్యం – 16,000 కేజీలు (16 టన్నులు)
ఈ కేసులో సోమందేపల్లి గ్రామానికి చెందిన
కొత్త అంకన్న గారి మహేష్ (26),
కురుబ రామకృష్ణప్ప అనే ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వాహనం డ్రైవర్ మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడు రామకృష్ణప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని త్వరలో అదుపులోకి తీసుకొని, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాను పూర్తిస్థాయిలో వెలికితీసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాను చాకచక్యంగా అడ్డుకొని భారీ మొత్తంలో PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఇన్‌స్పెక్టర్ శ్రీ C. ఆంజనేయులు.




