Puttaparthi: సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!
Puttaparthi: శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకల సందర్భంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం విద్యుత్ దీపాలతో ముస్తాబైంది.
Puttaparthi: సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!
Puttaparthi: సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ముస్తాబైన పుట్టపర్తి ప్రశాంతి నిలయం. రేపటి నుండి సత్యసాయి రథోత్సవంతో ప్రారంభం కానున్న సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు.
వేడుకలను పురస్కరించుకొని ప్రశాంతి నిలయంలోనీ సాయి కుల్వంత్ సభ మందిరం,గణేష్ గేట్,యజుర్వేద మందిరం, సౌత్ కాంటీన్, శాంతిభవన్, వెస్ట్రన్ క్యాంటీన్, ఐటి బిల్డింగ్, షాపింగ్ కాంప్లెక్స్, నార్త్ బిల్డింగ్ లు విద్యుత్ దీపాలతో దగ దగా మెరిసిపోతున్నాయి.
ప్రశాంతి నిలయంలోని పురవీధులన్నీ విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. సత్యసాయిబాబా జయంతి వేడుకలలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలి రావడంతో ప్రశాంతి మందిరం నూతన శోభను సంతరించుకుంది.
భారీగా తరలివచ్చిన భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిట లాడుతోంది. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
జయంతి వేడుకలకు ప్రముఖ సినీనటి రష్మిక మందాన, గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలిరానున్నారు. ప్రముఖులు బాబా జయంతి వేడుకలకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు.




