Anantapur: విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి, గవర్నర్, మంత్రి!

Anantapur: విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు

P.Sudhakar, Anantapuram
Published on: 1 July 2026 4:20 PM IST
Anantapur
X

Anantapur: విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి, గవర్నర్, మంత్రి!

అనంతపూర్: ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాగా, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.

విశ్వవిద్యాలయం చరిత్రలో తొలి స్నాతకోత్సవం కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ అనంతపురానికి చేరుకున్న సందర్భంగా హెలిపాడ్ వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఘన స్వాగతం పలికారు.

అనంతరం విశ్వవిద్యాలయానికి చేరుకుని నిర్వహించిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కొద్దిసేపు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొని పట్టభద్రులను అభినందించారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి సమాజ సేవకు, దేశ అభివృద్ధికి తోడ్పడేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.

స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నత విద్య వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా దేశ నిర్మాణానికి కూడా కీలకమని పేర్కొన్నారు.

విద్యార్థులు తమ జ్ఞానాన్ని సమాజ అభ్యున్నతికి వినియోగించాలని సూచించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ కూడా విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, నైపుణ్యాలు, ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా రాష్ట్రం, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

తొలి స్నాతకోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రాంగణం విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సందడిగా మారింది.

పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేయడంతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమం విజయవంతంగా ముగియగా, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యా ప్రస్థానంలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story