Anantapur: రాయదుర్గంలో సెక్షన్ 30.. ధర్నాలు చేస్తే కఠిన చర్యలు!

Anantapur: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సెక్షన్ 30 అమలులో ఉంది.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 28 April 2026 1:01 PM IST
Anantapur
X

Anantapur: రాయదుర్గంలో సెక్షన్ 30.. ధర్నాలు చేస్తే కఠిన చర్యలు!

Anantapur: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ జయనాయక్ హెచ్చరించారు. ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే రోగులకు నిరసనల కారణంగా ఇబ్బందులు కలగకూడదని ఆయన సూచించారు. పట్టణంలో ప్రస్తుతం సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని గుర్తుచేస్తూ, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై ఆందోళనలు చేపట్టే వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story