Puttaparthi: పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి.. పుట్టపర్తి కలెక్టర్ ఆదేశం

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం కలెక్టర్ ఏ. శ్యామ్ అధ్యక్షతన జరిగింది.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 29 May 2026 8:10 PM IST
Puttaparthi
X

Puttaparthi: పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి.. పుట్టపర్తి కలెక్టర్ ఆదేశం

Puttaparthi: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను నిబంధనల ప్రకారం నిర్దేశిత కాలపరిమితిలోగా వేగవంతంగా మంజూరు చేయాలని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల పురోగతిపై సమీక్షించారు. ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా ZM/APIIC, GM/DIC అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఎస్‌డీపీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. నెడ్‌క్యాప్ (NREDCAP) ద్వారా జిల్లాలో చేపడుతున్న సౌరశక్తి (సోలార్) ఉత్పత్తి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో కలిసి పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకంపై చర్చించి, నిర్దేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీ ఎంఎస్ఎంఈ ఈడీపీ/ఐడీపీ (AP MSME EDP/IDP 2024-29) పాలసీ కింద దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు రాయితీలను (సబ్సిడీలు) మంజూరు చేశారు. పీఎంఈజీపీ (PMEGP), పీఎం విశ్వకర్మ పథకాల అమలు తీరును సమీక్షించారు.

ఈ సమావేశంలో జీఎం డీఐసీ నాగరాజు, జెడ్ఎం ఏపీఐఐసీ నాగముని, ఏపీఐఐసీ ప్రతినిధి శ్రీమతి శశికళ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ LDM, సిల్క్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హరికృష్ణ , హ్యాండ్లూమ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story