Puttaparthi: పుట్టపర్తి భూసేకరణ, హంద్రీ-నీవా పనులపై సమీక్ష

Puttaparthi: భూసేకరణ, హంద్రీ-నీవా పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులకు ఆదేశం. జిల్లాలోని 195 చెరువులకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని సూచన.

S.Firoz, Sri Sathya Sai
Published on: 15 July 2026 9:30 PM IST
Puttaparthi
X

Puttaparthi: పుట్టపర్తి భూసేకరణ, హంద్రీ-నీవా పనులపై సమీక్ష

పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భూసేకరణ, హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పనుల పురోగతిపై సమీక్షించారు. వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఏపీఐఐసీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి భూసేకరణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

అలాగే హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పథకం కింద జిల్లాలోని 195 చెరువులకు నీరు అందించే పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేదా జాప్యం లేకుండా ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి రైతులకు సకాలంలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story