Puttaparthi: పుట్టపర్తి ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరిన బాధిత కుటుంబం

Puttaparthi: కుటుంబ పెద్దలను కోల్పోయి వీధిన పడ్డామని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి విన్నవించిన నల్లమాడ బాధితురాలు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 17 July 2026 3:15 PM IST
Puttaparthi
X

Puttaparthi: పుట్టపర్తి ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరిన బాధిత కుటుంబం

నల్లమాడ: కుటుంబ పెద్దలను కోల్పోయి ధీనస్థితిలో ఉన్నామని మా కుటుంబాన్ని ఆదుకోవాలని నల్లమాడ మండలం నల్లమాడ గ్రామానికి చెందిన చదివే సుమాంజలి పుట్టపర్తి శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి ని కోరారు. శుక్రవారం పుట్టపర్తి నియోజకవర్గం ఓ.డి చెరువు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశారు.

నల్లమాడ మండలం నల్లమాడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చదివే వెంకటలక్ష్మమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గతంలో ఆమె కుమారుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, నల్లమాడ మండల డ్రైవర్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు చదివే శ్రీనివాసులు గుండెపోటుతో మృతి చెందారు.

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా కలిగి ఉన్నాడు. అనతి కాలంలోనే వెంకట లక్ష్మమ్మభర్త చదివే కుళ్లాయప్ప అనారోగ్యంతో మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్సల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించడం జరిగిందన్నారు. ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. కుటుంబ పెద్దలు ముగ్గురు మృతి చెందడంతో కుటుంబం దీనస్థితిలో పడిందన్నారు.

వెంకట లక్ష్మమ్మ మృతి చెందిన సమయంలో మాజీ మంత్రి, ప్రస్తుత పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటానన్నారు. ప్రస్తుతం చదివే వెంకటలక్ష్మమ్మ కోడలు కృష్ణకుమారి ఆమె ముగ్గురు కుమార్తెలు ఉన్నారన్నారు. దీనస్థితిలో ఉన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేని కోరారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story