Puttaparthi: పుట్టపర్తిలో నైట్ విజన్ డ్రోన్లతో గణేష్ నిమజ్జన ప్రత్యేక నిఘా!
Puttaparthi: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు.
Puttaparthi: పుట్టపర్తిలో నైట్ విజన్ డ్రోన్లతో గణేష్ నిమజ్జన ప్రత్యేక నిఘా!
Puttaparthi: పుట్టపర్తిలో గణేష్ ఉత్సవాల సందర్భంగా అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టిన పోలీసులు. పుట్టపర్తి సెక్యూరిటీ వింగ్ సీఐ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో డ్రోన్ లతో నిఘా.
పట్టణంలోని హనుమాన్ సర్కిల్, గోపురం, ఆర్టీసీ బస్టాండ్ గోవిందపేట, వివేకానంద రోడ్డు, సాయి నగర్,చిత్రావతి రోడ్డు, కర్ణాటక నాగేపల్లి, ఎనుముల పల్లి,గోకులం ప్రాంతాలలో రాత్రి సమయాలలో అత్యాధునిక నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిశితంగా పరివేక్షించారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ కోసం పోలీసులు నిజం చేపట్టారు. భక్తుల రాకపోకలు మండపాల పరిసరాలు అనుమానాస్పద ప్రాంతాలతో పాటు జూదం ఇతర సాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై డ్రోన్లతో నిఘా ఉంచారు.
పట్టణంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందుల తలెత్తకుండా ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉండే విధంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలో వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని అడుగడుగునా పోలీసులు నిఘా ఉంచారు.




