Puttaparthi: ఎండిపోతున్న మొక్కలపై మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన పర్యావరణవేత్త

Puttaparthi: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో నీరు లేక ఎండిపోతున్న మొక్కలపై పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు కమిషనర్ శ్రీనివాసులును తీవ్రంగా నిలదీశారు.

L.Sudhakar, Puttaparthy
Published on: 10 Sept 2026 6:12 PM IST
Puttaparthi
X

Puttaparthi: ఎండిపోతున్న మొక్కలపై మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన పర్యావరణవేత్త

పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి గణేష్ సర్కిల్ నుండి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు 5 కిలోమీటర్లు రోడ్డు మధ్యలో మొక్కలు నాటిన మున్సిపల్ అధికారులు. చెట్లు నాటారు కానీ వాటికి నీరు పోయకపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయి.ఎండిపోతున్న చెట్లను చూసి మున్సిపల్ అధికారులపై పర్యావరణ ప్రేమికుడు భాస్కర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చెట్లు ఎందుకు పెట్టారు మీరు నీరు ఎందుకు పోయలేదు అంటూ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాసులు తో వాగ్వాదానికి దిగారు.లక్షలాది రూపాయలు వెచ్చించి చెట్లు నాటి నీరు ఎందుకు పోయలేదని చెట్లు ఎండిపోవడం మీకు ఇష్టమేనా అంటూ కమిషనర్ని నిలదీశారు. చెట్లకు నీరు పోసేందుకు టెండర్లు వేస్తున్నామని టెండర్లు వచ్చిన తర్వాత నీరు పోస్తామని కమిషనర్ చెప్పడంతో చెట్లు చనిపోయాక నీరు పోస్తారా అంటూ కమీషనర్ తో పర్యావరణ ప్రేమికుడు వాగ్వాదానికి దిగారు.

మీ ఇంటిలో అయితే చెట్లను అలాగే వదిలివేసేవారా అంటూ కమిషనర్ను ప్రశ్నించారు.పచ్చని చెట్ల పట్ల మీకెందుకు నిర్లక్ష్యం అంటూ కమీషనర్ ను నిలదీయడంతో నాకు తెలియదు అంటూ మధ్యలోనే వెళ్లిపోయిన కమిషనర్ శ్రీనివాసులు పోవద్దంటూ సమాధానం చెప్పాలని నిలువరించిన పర్యావరణవేత్త.

పచ్చదనం పరిశుభ్రత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ ప్రభుత్వం చెట్లను నాటాలని వాటిని పరిరక్షించాలని చెబుతున్నప్పటికీ అధికారులలో మాత్రం చలనం లేదనీ లక్షలాది రూపాయలు వచ్చింది రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటితే వాటిని సంరక్షించాల్సిన అధికారులే తూట్లు పొడుస్తున్నారని నీరు లేక చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయని కావున పై అధికారులు వెంటనే స్పందించి చెట్లు ఎండిపోకుండా నిరంతరం నీరు పోసే విధంగా చర్యలు తీసుకోవాలని భాస్కర్ నాయుడు కోరుతున్నాడు.

L.Sudhakar, Puttaparthy

L.Sudhakar, Puttaparthy

Next Story