Puttaparthi: పుట్టపర్తిలో అత్యాధునిక ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన UIDAI ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 1 Jun 2026 12:10 PM IST
Puttaparthi
X

Puttaparthi: పుట్టపర్తిలో అత్యాధునిక ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన UIDAI ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, మొబైల్ నంబర్ లింకింగ్, చిరునామా మార్పు మరియు బయోమెట్రిక్ అప్‌డేట్‌లు వంటి అన్ని రకాల సేవలు వేగవంతంగా, పారదర్శకంగా లభిస్తాయన్నారు.విజయవాడ, వైజాగ్ వంటి నగరాల్లో ఉండే అత్యాధునిక డిజిటల్ సేవలు ఇకపై పుట్టపర్తిలోనే లభిస్తాయి అన్నారు. దీనివల్ల స్థానిక ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు గ్రామీణ ప్రాంతాల వారు ఆధార్ సేవల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.

ఆధార్ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో కృషి చేసిన UIDAI అధికారులు మరియు బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ బృందాన్ని కలెక్టర్ అభినందించారు. ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు అందరూ ఈ కేంద్రం ద్వారా తమ ఆధార్ వివరాలను నవీకరించుకుంటూ, ఈ సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటులో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్డీఓ సువర్ణ, తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి,ఆధార్ కేంద్రం సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story