Puttaparthi: రూ.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Puttaparthi: 33 మంది లబ్ధిదారులకు రూ.20.86 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్‌ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 26 Jun 2026 7:15 PM IST
Puttaparthi
X

Puttaparthi: రూ.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

పుట్టపర్తి: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా అందిస్తున్న ఆర్థిక సాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటోందని పుట్టపర్తి నియోజవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి అన్నారు.

శుక్రవారం పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి నియోజకవర్గానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.20,86,536 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు అండగా నిలుస్తూ కష్టకాలంలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఆపద్బాంధవుడని కొనియాడారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వ్యక్తిని, ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో పుట్టపర్తి నియోజకవర్గంలో మొత్తం 431 మంది లబ్ధిదారులకు రూ.4.12 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేసి పేద కుటుంబాలను ఆదుకున్నామని ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి తెలిపారు.

భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. పలు రకాల జబ్బులతో ఇబ్బంది పడి ఆసుపత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3 మాసాల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సహకార సొసైటీ అధ్యక్షులు విజయకుమార్ , సామకోటి ఆదినారాయణ, శ్రీరామ్ నాయక్, శ్రీరాములు ,రాజా కూటమి నాయకులు, అధికారులు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story