Puttaparthi: 33 మందికి రూ.20.86 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

Puttaparthi: 33 మంది లబ్ధిదారులకు రూ.20.86 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.

MARUTHI, PUTTAPARTHI RURAL
Published on: 26 Jun 2026 8:19 PM IST
Puttaparthi
X

Puttaparthi: 33 మందికి రూ.20.86 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

పుట్టపర్తి: నియోజకవర్గానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు రూ.20,86,536 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పంపిణీ చేసినట్లు తెలిపారు.

"పేదలకు అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు ఆపద్బాంధవుడని, కష్టకాలంలో సాయం చేసిన ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని" ఎమ్మెల్యే సింధూర రెడ్డి అన్నారు. రెండేళ్లలో నియోజకవర్గంలో 431 మందికి రూ.4.12 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ అందజేసినట్లు ఆమె వెల్లడించారు.

ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు 3 నెలల్లోగా సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు విజయకుమార్, సామకోటి ఆదినారాయణ, శ్రీరామ్ నాయక్, శ్రీరాములు, రాజా, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

MARUTHI, PUTTAPARTHI RURAL

MARUTHI, PUTTAPARTHI RURAL