O.D. Cheruvu: రైతులకు కొత్త పాసుపుస్తకాల పంపిణీ ఎమ్మెల్యే పల్లె

O.D. Cheruvu: శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 5 Aug 2026 6:46 PM IST
O.D. Cheruvu
X

O.D. Cheruvu: రైతులకు కొత్త పాసుపుస్తకాల పంపిణీ ఎమ్మెల్యే పల్లె

ఓడి చెరువు: రైతుల హక్కులను పరిరక్షిస్తూ, భూ యాజమాన్యానికి మరింత భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. ఓడి చెరువు మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో డబురువారిపల్లి, తిప్పేపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా 2,237 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పాటు రైతు ఫోటో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె మాట్లాడుతూ...గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆనాడు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోను ముద్రించి పంపిణీ చేశారని, అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు గౌరవాన్ని కాపాడే విధంగా రైతు ఫోటోతో పాటు ప్రభుత్వ అధికారిక రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తోందని తెలిపారు.

"మన భూమి – మన హక్కు" అనే భావనతో రైతులకు వారి భూ హక్కులపై పూర్తి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. పుట్టపర్తి నియోజవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

నియోజవర్గం లో లక్ష కోట్లతో పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ ఏర్పాటు తో పుట్టపర్తి నియోజవర్గ అభివృద్ధి గేమ్ చెంజర్ గా మారడం ఖాయం అన్నారు. అదే విధంగా ఆమడ గూరు మండలంలో రూ. 51వేల కోట్లతో అతి పెద్ద రిలయన్స్ సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు తో ఈ ప్రాంత అభివృద్ధితో పాటు వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అతి త్వరలో ఓడి చెరువు కు మరో సోలార్ ప్రాజెక్టు రానున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు మండల తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి,మండల కన్వీనర్ జయచంద్ర , మాజీ జెడ్పీటీసి పిట్టా ఓబుల రెడ్డి, సొసైటీ అధ్యక్షులు తుమ్మల మహబూబ్ బాషా, బోయపల్లి శివారెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు నిజాం, కంచి సురేష్, కూటమి నాయకులు, మహిళా నాయకురాలు సుభాషిణి , డబురువారిపల్లి ,తిప్పేపల్లి పంచాయతీ టీడీపీ కుటుంబ సభ్యులు,రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story