Sri Sathya Sai: పుట్టపర్తిలో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్!
Sri Sathya Sai: పుట్టపర్తి మున్సిపల్ నామినేషన్ కేంద్రాలను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ పరిశీలించారు. 1-28 వార్డుల ఏర్పాట్లను సమీక్షించి ఆదేశాలు.
Sri Sathya Sai: పుట్టపర్తిలో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్!
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి: పుట్టపర్తి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా చైర్మన్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పరిశీలించారు. పట్టణంలోని చిన్నపల్లి ఉన్నత పాఠశాల, ఎనుములపల్లిలోని బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి అక్కడ చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులకు నిర్దిష్ట కేంద్రాలను కేటాయించి, అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
వార్డుల వారీగా నామినేషన్ కేంద్రాలు: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 1 నుంచి 12వ వార్డుల అభ్యర్థుల నామినేషన్లను చిన్నపల్లి ఉన్నత పాఠశాలలో స్వీకరించనున్నారు. 13 నుంచి 28వ వార్డుల అభ్యర్థుల నామినేషన్లను ఎనుములపల్లిలోని బీసీ బాలుర వసతి గృహంలో స్వీకరించనున్నారు.
16 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ: ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
పోటీ చేసే అభ్యర్థులు, వారి ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు వార్డుల వారీగా కేటాయించిన నామినేషన్ కేంద్రాలను గమనించాలని, నిర్దేశిత సమయపాలన పాటిస్తూ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు దాఖలు చేయాలని కలెక్టర్ కోరారు.




