Puttaparthi: ప్రశాంతి నిలయంలో సైబర్ క్రైమ్‌పై పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు!
Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై సిబ్బందికి పోలీసుల అవగాహన.
Puttaparthi: ప్రశాంతి నిలయంలో సైబర్ క్రైమ్‌పై పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు!
Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సైబర్ క్రైమ్ పై ప్రశాంతి నిలయం సిబ్బందికి అవగాహన కార్యక్రమం చేపట్టిన పోలీసులు. ప్రశాంతి నిలయంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సత్సంగ్ సమావేశ మందిరంలో పుట్టపర్తి డిఎస్పి సత్యనారాయణ , సీఐ యువరాజ్ తో కలిసి జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్,మొబైల్ దొంగతనాలపై అవగాహన కార్యక్రమం. డిజిటల్ అరెస్టు,ట్రేడింగ్ స్కాం,హనీ ట్రాప్, కేవైసీ,లోన్ యాప్ స్కామ్ లతోపాటు జాబు మరియు ఇన్వెస్ట్ మెంట్ స్కామ్ లపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించిన జిల్లా ఏ ఎస్పీ.
సత్యసాయి బాబా మహా సమాధి దర్శనార్థం దేశ విదేశాల నుండి ప్రశాంతి నిలయానికి భక్తుల రాక నేపథ్యంలో సైబర్ క్రైమ్ ఫై అవగాహన కల్పించిన పోలీసులు. ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ ఫై అప్రమత్తంగా ఉండాలని వచ్చే భక్తులకు అవగాహన కల్పించాలని సూచించిన జిల్లా ఎస్పీ అంకిత సురాన. ప్రతి ఒక్కరితోనో సైబర్ క్రైమ్ పైన అనుమానాలను అడిగి తెలుసుకున్న ఏ ఎస్పీ అంకిత సురాన.
సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన విషయాలను ఏ ఎస్పీ దృష్టికి తీసుకువచ్చిన సిబ్బంది. మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ టెలీగ్రామ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ఏఎస్పి. జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్న ఏ ఎస్పి. ప్రశాంతి నిలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల మొబైల్ దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఏ ఎస్పీ.




