Puttaparthi: సత్యసాయి తాగునీటి ప్రాజెక్టుకు రూ.కోటి నిధులు మంజూరు

Puttaparthi: పుట్టపర్తి నియోజకవర్గ తాగునీటి సమస్య పరిష్కారానికి సత్యసాయి ప్రాజెక్టుకు రూ.కోటి నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే సింధూర రెడ్డి తెలిపారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 10 Sept 2026 5:39 PM IST
Puttaparthi
X

Puttaparthi: సత్యసాయి తాగునీటి ప్రాజెక్టుకు రూ.కోటి నిధులు మంజూరు

పుట్టపర్తి: నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సత్యసాయి తాగునీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసింది.

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

నియోజకవర్గ ప్రజలకు సురక్షితమైన, నిరంతర తాగునీటి సరఫరా అందించడంలో సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కీలకమని సింధూర రెడ్డి అన్నారు. ప్రజల తాగునీటి అవసరాలకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకువచ్చి మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రాజెక్టుకు రూ.కోటి నిధులు మంజూరు కావడంపై నియోజకవర్గ ప్రజలు, ప్రాజెక్టు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI