OD Cheruvu: చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో రెయిన్బో విద్యార్థుల ప్రభంజనం!

OD Cheruvu: ఓడీ చెరువు చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో రెయిన్బో పాఠశాల విద్యార్థుల ప్రభంజనం.. వరుసగా 4వ ఏడాది ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం.

S.Firoz, Sri Sathya Sai
Published on: 12 Sept 2026 8:15 AM IST
OD Cheruvu
X

OD Cheruvu: చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో రెయిన్బో విద్యార్థుల ప్రభంజనం!

OD Cheruvu: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. వరుసగా నాలుగో సంవత్సరం మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో సెప్టెంబర్ 27న జరగనున్న జిల్లా స్థాయి పోటీలకు రెయిన్బో పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.

ప్రథమ స్థానంలో 10వ తరగతికి చెందిన జి. హర్షవర్ధన్ రెడ్డి, 9వ తరగతికి చెందిన కే. మనోజ్ కుమార్, 8వ తరగతికి చెందిన బి. సుశాంత్ రెడ్డి నిలిచారు. ద్వితీయ స్థానంలో 10వ తరగతికి చెందిన కే. పునీత, 9వ తరగతికి చెందిన ఎస్. సుధీర్ కుమార్ రెడ్డి, 8వ తరగతికి చెందిన డి. జోషిక నిలిచారు.

ఈ సందర్భంగా విజేతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. జయసింహారెడ్డి అభినందించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసి, నిరంతరం మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

విద్యార్థుల పట్టుదల, క్రమశిక్షణతో కూడిన సాధనతో పాటు ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ, మార్గదర్శకత్వమే ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. వరుసగా నాలుగో సంవత్సరం మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించడం రెయిన్బో పాఠశాల విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai