Gooty: న్డీఏ కూటమి ప్రభుత్వంలోనే రజకులకు ఉన్నత స్థానం: గుమ్మనూరు!

Gooty: అనంతపురం జిల్లా గుత్తిలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో జరిగిన రజక ఆకాంక్ష సభ-6కు గుమ్మనూరు నారాయణస్వామి, ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 12 July 2026 10:06 PM IST
Gooty
X

Gooty: న్డీఏ కూటమి ప్రభుత్వంలోనే రజకులకు ఉన్నత స్థానం: గుమ్మనూరు!

గుత్తి: రజకులను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, గుంతకల్లు మండల ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి అన్నారు.

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోనీ వీరుపాక్షి రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం రజక ఆకాంక్ష సభ-6 జరిగింది. ఈ సభకు నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి, ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి, రజక కార్పోరేషన్ చైర్మన్ సావిత్రి పాల్గొన్నారు.

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహించామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్, ఎంకే చౌదరి, రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story