Anantapur: వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా రమేష్ నాయక్!

Anantapur: అనంతపురం జిల్లా వైయస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా పామిడి మండలానికి చెందిన రామావత్ రమేష్ నాయక్ నియామకం. గుంతకల్లులో పత్రం అందజేత.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 16 Oct 2026 3:49 PM IST
Anantapur
X

Anantapur: వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా రమేష్ నాయక్!

పామిడి: అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా పామిడి మండలం రామగిరి ఎగువ తండాకు చెందిన రామావత్ రమేష్ నాయక్ నియమితులయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదలైంది.

ఈ సందర్భంగా గుంతకల్లు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి రామావత్ రమేష్ నాయక్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి మురళి నాయక్, పామిడి మండల గ్రీవెన్స్ అధ్యక్షుడు భాస్కర్ నాయక్, పామిడి మండల ఎస్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

తన నియామకంపై రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శి పదవిని కేటాయించిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి, పార్టీ పెద్దలకు, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డికి, జిల్లా అధ్యక్షులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రామావత్ రమేష్ నాయక్ తెలిపారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL