Raptadu: రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల విగ్రహావిష్కరణ: ఎమ్మెల్యే అమిలినేని

Raptadu: రాప్తాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నివాళులర్పించారు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 22 Sept 2026 9:29 PM IST
Raptadu
X

Raptadu: రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల విగ్రహావిష్కరణ: ఎమ్మెల్యే అమిలినేని

సత్యసాయి జిల్లా: రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన స్వర్గీయ పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు.

జోన్-5 ఇన్‌చార్జ్ రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజులతో కలిసి అమిలినేని సురేంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం పరిటాల సునీత, ఎంపీ బీకే పార్థసారథి, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పరిటాల రవీంద్ర పేద ప్రజల సంక్షేమం కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam