Raptadu: రాప్తాడు పాఠశాల ఘటన నిందితుడు హేమంత్ జిల్లా జైలుకు తరలింపు!
Raptadu: రాప్తాడు పాఠశాల ఘటన నిందితుడు హేమంత్‌ను 20 రోజుల చికిత్స అనంతరం కర్నూలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి బుధవారం జిల్లా జైలుకు తరలించారు.
Raptadu: రాప్తాడు పాఠశాల ఘటన నిందితుడు హేమంత్ జిల్లా జైలుకు తరలింపు!
రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడి ఘటనకు పాల్పడిన నిందితుడు హేమంత్‌ను జిల్లా జైలుకు తరలించారు.పోలీసుల కాల్పుల అనంతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్‌కు కుడికాలు తొలగించిన విషయం తెలిసిందే. అయితే చికిత్స సమయంలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్య తలెత్తడంతో మెరుగైన వైద్యం కోసం కోర్టు ఆదేశాల మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దాదాపు 20 రోజుల పాటు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి, కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందిన హేమంత్‌ను కోర్టు ఆదేశాలతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.అనంతరం ఇవాళ పోలీసుల బందోబస్తు మధ్య కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం పరిధిలో ఉన్న సబ్ జైలుకు తరలించారు.దీంతో రాప్తాడు పాఠశాల ఘటన నిందితుడు హేమంత్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి జైలుకు చేరుకున్నాడు.




