Raptadu: చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోను దహనం చేసిన మాజీ ఎమ్మెల్యే
Raptadu: కూటమి రెండేళ్ల వైఫల్యాలపై రాప్తాడులో వైస్సార్సీపీ భారీ నిరసన. చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోను దహనం చేసిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
Raptadu: చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోను దహనం చేసిన మాజీ ఎమ్మెల్యే
Raptadu: చంద్రబాబు నాయుడు 'సూపర్ సిక్స్' మ్యానిఫెస్టోను ప్రజలకు పంచి ఓట్లు దండుకున్నారని, నేడు ఆ మ్యానిఫెస్టో ప్రతులను అగ్నికి ఆహుతి చేశామని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు.చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మరియు తెలుగుదేశం పార్టీని ప్రజలు కూకటివేళ్లతో పెకలించి వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
అమరావతిలో తాము భూములు కొన్న ప్రాంతంలో లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, దాదాపు లక్ష కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టారని ఆరోపించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఉన్న ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ మరియు పంటల బీమా వంటి సంక్షేమ పథకాలు ప్రస్తుతం అందడం లేదని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మోసపూరిత మాటలు చెప్పి మోసం చేశారని, కనీసం నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని అన్నారు.
రాప్తాడు నియోజకవర్గంలో పేదల ఇళ్లను కూల్చివేసిన దుర్మార్గపు ప్రభుత్వమిదని, పరిటాల సునీత నేతృత్వంలో 14 ఇళ్లను కూల్చివేసి, పాపం పేటలో 10,000 ఇళ్లను ఆక్రమించుకునేందుకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని రాప్తాడు వైసిపి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.




