Sri Sathya Sai: ఓ.డి.చెరువులో రెండు తలలు, మూడు కళ్లతో జన్మించిన లేగదూడ

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా ఓ.డి.చెరువులో వింత ఘటన. రెండు తలలు, మూడు కళ్లతో అరుదైన లేగదూడ జననం. పరమశివుని స్వరూపంగా భావించి పూజలు చేసిన స్థానికులు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 24 Aug 2026 9:19 AM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: ఓ.డి.చెరువులో రెండు తలలు, మూడు కళ్లతో జన్మించిన లేగదూడ

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా ఓ.డి.చెరువు మండలం, చెరువు మునెప్పగారి పల్లిలో వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు నాగరత్నమ్మకు చెందిన జెర్సీ ఆవు రెండు తలలు, మూడు కళ్లతో అరుదైన లేగదూడకు జన్మనిచ్చింది.

ఈ విషయం గ్రామంలో తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని వింత దూడను ఆసక్తిగా తిలకించారు. దూడకు మూడు కళ్లుండటంతో పరమశివుని పోలి ఉందంటూ పలువురు భావించారు. కొందరు కుంకుమ బొట్లు పెట్టి, హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు.

గతంలో తాము ఇలాంటి లేగదూడను ఎప్పుడూ చూడలేదని గ్రామస్థులు తెలిపారు. రెండు తలలు, మూడు కళ్లతో జన్మించిన ఈ దూడను పరమశివుని అనుగ్రహంగా భావిస్తూ పూజలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

దూడ పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉందని రైతు నాగరత్నమ్మ తెలిపారు. అరుదైన రూపంతో జన్మించిన ఈ లేగదూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story