Puttaparthi: పుట్టపర్తి వేడుకల్లో పాల్గొన్న రష్మిక.. మహిళా శక్తిపై కీలక వ్యాఖ్యలు!

Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయి బాబా 101వ జయంతి వేడుకలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో సినీ నటి రష్మిక మందాన పాల్గొని ప్రసంగించారు.

L.Sudhakar, Puttaparthy
Published on: 19 Nov 2026 10:28 AM IST
Puttaparthi
X

Puttaparthi: పుట్టపర్తి వేడుకల్లో పాల్గొన్న రష్మిక.. మహిళా శక్తిపై కీలక వ్యాఖ్యలు!

Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయి బాబా 101 వ జయంతి వేడుకలలో భాగంగా ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయి కుల్వంత్ సభ మందిరంలో వివిధ రంగుల పూలతో ప్రత్యేకంగా సత్యసాయి మహా సమాధిని అలంకరించిన భక్తులు.

సత్యసాయి బాబా 101 వ జయంతి వేడుకలలో పాల్గొని సాయి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న ప్రముఖ సినీనటి రష్మిక మందాన. అనంతరం మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రముఖ సినీనటి రష్మిక మందాన. హంగూ ఆర్భాటం లేకుండా సామాన్య భక్తురాలి మాదిరి నేలపైన కూర్చుని వేడుకలను తిలకించిన సినీ నటి.

ఈ సందర్భంగా సత్యసాయి విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సత్య సాయి ని కీర్తిస్తూ సత్య సాయి విద్యార్థులు నిర్వహించిన సాంప్రదాయ నృత్యాలు ఎంతగానో అలరించాయి. భారతీయ సాంప్రదాయాన్ని నృత్యాలతో విద్యార్థులు సందడి చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటి రష్మిక మాట్లాడుతూ తన భర్త విజయ్ సాయి దేవరకొండ, కుటుంబ సభ్యుల ద్వారా స్వామివారి బోధనలు, ఆధ్యాత్మిక విలువలతో పరిచయం ఏర్పడిందన్న రష్మిక. స్వామివారి మాటలు కేవలం సందేశాలు మాత్రమే కావని, అవి మనం అనుసరించాల్సిన జీవన విధానమని పేర్కొన్నారు.

మహిళలు ఆధ్యాత్మికంగా, మానసికంగా బలంగా ఉండాలని, సామాజిక బాధ్యతతో జీవించాలని స్వామివారు ఆకాంక్షించారని తెలిపారు. మహిళలే సమాజానికి పునాదనీ ప్రేమ, కరుణ, సహనం, త్యాగం, ధైర్యం, సేవాభావం మహిళల గొప్ప లక్షణాలని వివరించారు.

మహిళలు తమ కలలను సాకారం చేసుకోవడానికి ఇతరులకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా శక్తి అంటే కష్టాలను భరించడం మాత్రమే కాదని, అన్యాయాన్ని ఎదిరించి, తాము అంగీకరించని పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం కూడా మహిళా శక్తేనని అన్నారు.

సైన్యం, సైన్స్, టెక్నాలజీ, రాజకీయాలు, వ్యాపారాలు, క్రీడలు, కళలు తదితర రంగాల్లో మహిళలు అద్భుత విజయాలు సాధిస్తున్నారని ప్రశంసించారు.

సేవాభావం: పేదలకు సేవ చేయడం, నిజాయితీ, క్రమశిక్షణ, శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించడం ద్వారా మహిళలు సమాజాభివృద్ధికి తోడ్పడతారని వివరించారు.

మహిళా సాధికారత కేవలం సామాజిక లక్ష్యం మాత్రమే కాదని, దేశాభివృద్ధికి అత్యంత అవసరమైన అంశమని స్పష్టం చేశారు. స్వామివారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన బోధనలు కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు.

L.Sudhakar, Puttaparthy

L.Sudhakar, Puttaparthy