Anantapur: మొదటిసారిగా వేపరాళ్లలో 100 ఎకరాల్లో పశుగ్రాస పెంపకం!

Anantapur: అనంతపురం జిల్లా వేపరాళ్ల చెరువులో 100 ఎకరాల్లో పశుగ్రాసం విత్తనాల కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 4 Aug 2026 4:36 PM IST
Anantapur
X

Anantapur: మొదటిసారిగా వేపరాళ్లలో 100 ఎకరాల్లో పశుగ్రాస పెంపకం!

అనంతపురం: రాయదుర్గం నియోజకవర్గంలో రాత మారబోతోంది వర్షాభావ పరిస్థితులను అధిగమించి, రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది.

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామం సమీపంలోని చెరువులో ఏకంగా 100 ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసం విత్తనాలు విత్తే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ​ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరై, ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ​రాష్ట్రంలోనే మొదటిసారిగా వేపరాళ్ల చెరువులో 100 ఎకరాల్లో సామూహిక పశుగ్రాస పెంపకానికి నాంది పలికామన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ప్రతికూల వర్షపాత సమస్యలను అధిగమించేందుకు క్షేత్రస్థాయిలో అనేక సమీక్షలు నిర్వహించాం.

ఒకవైపు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తూనే, మరోవైపు భవిష్యత్తులో పశుగ్రాస కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.మేత లేక పశువులను అమ్ముకునే పరిస్థితి ఏ రైతుకూ రానివ్వమన్నారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story