Rayadurgam: రాయదుర్గంలో 'ఇంటింటికీ తెలుగుదేశం' ఎమ్మెల్యే కాలవ
Rayadurgam: చంద్రబాబు పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. రాయదుర్గంలో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.
Rayadurgam: రాయదుర్గంలో 'ఇంటింటికీ తెలుగుదేశం' ఎమ్మెల్యే కాలవ
రాయదుర్గం: చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం మంగళవారం రాయదుర్గం పట్టణంలోని 13వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు ఇంటింటికి వెళ్తుంటే..! ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతూ చంద్రబాబు పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వారే చక్కగా వివరిస్తున్నారని తెలిపారు.
లబ్దిదారుల స్పందన చూస్తుంటే ఆనందమేస్తోందన్నారు. ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల సంతోషంగా ఉన్నారన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించే ‘తల్లికి వందనం’ ద్వారా అర్హత కలిగిన కుటుంబాల్లోని పిల్లలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు.
అదేవిధంగా అన్నదాత సుఖీభవ రైతులకు ఏడాదికి రూ.20వేల పెట్టుబడి రాయితీ అందుతోందని వారు చెబుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో 2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు, ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్ల పాలన లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయన్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకే ప్రజలు తమను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడకుండా కఠినంగా వ్యవహరిస్తుండటంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నదన్నారు.
ప్రజలకు మంచి పరిపాలన అందించడం, సంక్షేమాన్ని చేరువ చేయడం, అభివృద్ధిని వేగవంతం చేయడం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమవుతోందన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు.
తెలుగు ప్రజలకు ఇలాంటి సమర్థవంతమైన, దార్శనిక నాయకుడు లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, వార్డ్ ఇంఛార్జి నాగరాజు నాయక్,పరిశీలాకులు గుర్రప్ప,సెంట్రల్ స్టోర్ అధ్యక్షుడు పూజరి శివ,క్లస్టర్ ఇంఛార్జి పోరాళ్ల పురుషోత్తం, కొండాపురం శ్రీనివాసులు, ధనర్జున,బుదురు తిప్పేస్వమి,డబ్బిడి శివ,అన్నే బసవరాజు, మల్లికార్జున, ఆనంద్,జీలాన్, ఎల్లప్ప,అన్నే బసవరాజు తదితరులు పాల్గొన్నారు




