Rayadurgam: రాయదుర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
Rayadurgam: 32వ వార్డు సిద్ధేశ్వర కాలనీలో ఇంటింటికీ తిరిగి స్వయంగా పింఛన్లు అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.
Rayadurgam: రాయదుర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
రాయదుర్గం: పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోందని రాయదుర్గం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తెలిపారు.సోమవారం ఉదయం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 32వ వార్డు సిద్ధేశ్వర కాలనీలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూన్ 1న రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,728 కోట్ల సామాజిక పెన్షన్లను వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ బాధితులకు ఇంటి వద్దకే అందిస్తున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా అండగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
రాయదుర్గం నియోజకవర్గంలో మొత్తం 36,762 మంది లబ్ధిదారులకు రూ.16.10 కోట్ల పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సామాజిక పెన్షన్లను సక్రమంగా అందజేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




