Rayadurgam: రాయదుర్గం మద్యం షాపుల్లో ఎంఆర్‌పీ ఉల్లంఘనలు

Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో మద్యం షాపులు, బెల్ట్ షాపుల్లో ఎంఆర్‌పీ (MRP) కంటే అదనపు వసూళ్లపై ఏఐవైఎఫ్ (AIYF) ఆగ్రహం.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM
Published on: 19 July 2026 1:15 PM IST
Rayadurgam
X

Rayadurgam: రాయదుర్గం మద్యం షాపుల్లో ఎంఆర్‌పీ ఉల్లంఘనలు

Rayadurgam: రాయదుర్గం నియోజకవర్గంలో అధికారిక లైసెన్స్ ఉన్న మద్యం tv వైన్ షాపులతో పాటు అక్రమ బెల్ట్ షాపుల్లో కూడా MRP కన్నా విచ్చలవిడిగా అదనపు వసూళ్లు జరుగుతున్నాయి. పట్టణంలో రూ. 10, 20, గ్రామాల్లో ఏకంగా రూ. 40 వరకు దోపిడీ చేస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్లు మూసుకున్నారు.

ఆధారాలతో బయటపడిన దోపిడీ:

1. రాయదుర్గం పట్టణం: 18 జూలై 2026 న "Mansion House" బ్రాందీ బాటిల్ MRP రూ. 210 కాగా, షాపు వారు రూ. 220 వసూలు చేశారు. Navi UPI ద్వారా చెల్లింపు జరిగిన రసీదు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి బాటిల్‌పై రూ. 10 చొప్పున దోపిడీ చేస్తున్నారు.

2. హీరేహాల్ మండలం: కొన్ని రోజుల క్రితం బాటిల్‌పై రూ. 20 అదనంగా వసూలు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు.

3. గ్రామాల్లో బెల్ట్ షాపులు: అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపుల్లో ఏకంగా రూ. 40 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

ఎక్సైజ్ శాఖ + ప్రభుత్వ వైఫల్యం:

కూటమి ప్రభుత్వ హయాంలో ఒక్కో మండలానికి 30-40 మద్యం షాపులు ఇచ్చి, ఒక్కొక్కరి దగ్గర 50 వేల నుండి లక్ష రూపాయల వరకు డిపాజిట్లు, వేలం పాటల పేరుతో వసూలు చేశారు. బెల్ట్ షాపులను అరికడతామని చెప్పి, పైగా వారి నుండి డిపాజిట్లు తీసుకుని ప్రోత్సహించారు. ఆ డబ్బు తిరిగి ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.

ఇంకా దారుణం ఏమిటంటే గుమ్మగట్ట మండలంలోని కొన్ని గ్రామాల్లో స్కూళ్ల దేవాలయాలు పరిసర ప్రాంతాల్లోనే బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.

UPI, ఫోన్ పే ద్వారా రసీదులతో సహా దోపిడీ జరుగుతున్నా ఎక్స్చేంజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దాని వెనుక ఉన్న అంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాలి.

AIYF డిమాండ్లు:

1.రాయదుర్గం నియోజకవర్గంలోని అన్ని వైన్ షాపులు, బెల్ట్ షాపులపై వెంటనే దాడులు నిర్వహించి MRP కన్నా అదనంగా వసూలు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

2. అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి ఇప్పించాలి.

3. ప్రతి షాపులో ప్రభుత్వం నిర్ణయించిన MRP లిస్ట్‌ను బహిరంగంగా ప్రదర్శించాలి. ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దు చేయాలి.

4. స్కూళ్లు, కళాశాలలు, దేవాలయాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని మద్యం షాపులు, బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలి.

5. బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి తీసుకున్న డిపాజిట్ల లెక్కలు బహిరంగపరచి, ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి.

ప్రజల రక్తాన్ని పీల్చే ఈ దోపిడీని ఆపకపోతే AIYF ఆధ్వర్యంలో తొందరలో రాయదుర్గం ఎక్సైజ్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరిస్తున్నాము.

ప్రభుత్వం వెంటనే స్పందించి వినియోగదారులను ఈ దోపిడీ నుండి కాపాడాలి.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM

Next Story