Sri Sathya Sai: అక్రమ ఇసుక రవాణా ఆపండి.. ధర్మవరం ఆర్డీవోకు విన్నపం!

Sri Sathya Sai: ధర్మవరం నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాపై ఆర్డీవోకు కాంగ్రెస్ నేత తుంపర్తి పరమేష్ ఫిర్యాదు.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 4 May 2026 1:33 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: అక్రమ ఇసుక రవాణా ఆపండి.. ధర్మవరం ఆర్డీవోకు విన్నపం!

శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం RDO కార్యాలయం నందు జరుగుతున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుంపర్తి పరమేష్ ధర్మవరం నియోజకవర్గం లో ఇసుక అక్రమ రవాణా పై ఫిర్యాదు చేశారు. ధర్మవరం నియోజకవర్గం వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణా అరికట్టాలి. ధర్మవరం మండలం తుంపర్తి గ్రామం నందు చిత్రావతి నదితీరంలో అక్రమంగా ఇసుక, సుండు రవాణా మరియు తుంపర్తి గ్రామంలో స్మశాన వాటిక ఏర్పాటుకు విన్నపం

అయ్యా : కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తుంపర్తి గ్రామంలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది దీనివలన అటు పర్యావరణానికి గ్రామానికి రైతుల భూములకు ప్రమాదకరంగా వుంది. అలాగే అత్యధికంగా అక్రమఇసుక ట్రాక్టర్లు తిరగడం వలన రోడ్డు మొత్తం పాడైపోయింది దీనివలన స్కూల్ పిల్లల బస్సుల కు గ్రామప్రజలకు ప్రయాణం ఇబ్బందికరంగా వుంది. స్మశానవాటికకు సరైన రక్షణ లేదు శవాలను పూడ్చిన చోటే అక్రమంగా ఇసుక తోడి స్మశానమే లేకుండా చేసినారు కావున RDO గారు అక్రమ ఇసుక రవాణాని ఆపి గ్రామాన్ని కాపాడాలని అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోని గ్రామాన్ని కాపాడాలని తెలియజేస్తున్నాను.

అలాగే గ్రామానికి రోడ్డు సౌకర్యార్థం కొత్త రోడ్డు వేయాలని, సరైన స్మశానవాటికకు స్థల కేటాయింపుతో పాటు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాను లేని యడల ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మరియు గ్రామస్తులతో కలిసి ప్రజా పోరాటం చేపడతాం అని, అలాగే నూతనంగా ఏర్పడ్డ తుంపర్తి కాలనికి పెనుగొండ మాజీ ఎమ్మెల్యే కనముక్కల సానే చెన్నారెడ్డి గారి పేరు మరియు తుంపర్తి గ్రామ పెద్దలుగా వున్న కొండ్రేడ్డి వెంకటరెడ్డి గారి పేరు యర్రగుంట నారప్ప గారి పేరు పెట్టాలని తెలియజేస్తున్నాను.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM