Dharmavaram: వికలాంగుల జీవితాల్లో వెలుగులు.. సత్య కుమార్ సేవా యజ్ఞం

Dharmavaram: ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో వికలాంగులకు ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరం నిర్వహిస్తున్నారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 28 April 2026 4:33 PM IST
Dharmavaram
X

Dharmavaram: వికలాంగుల జీవితాల్లో వెలుగులు.. సత్య కుమార్ సేవా యజ్ఞం

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని వికలాంగుల జీవితాల్లో సరికొత్త ఆశలు నింపుతూ, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్.Y ప్రత్యేక చొరవతో నిర్వహిస్తున్న ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. సంస్కృతి సేవా సమితి సౌజన్యంతో,

ప్రపంచ ప్రఖ్యాత భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి (BMVSS) ఆధ్వర్యంలో ధర్మవరం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో ఈ బృహత్తర శిబిరం కొనసాగుతోంది. ఆర్థిక స్థోమత లేక కృత్రిమ అవయవాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో, మంత్రి గారు తన సొంత నియోజకవర్గ ప్రజల కోసం ఈ అరుదైన అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

నిన్న ప్రారంభమైన ఈ శిబిరంలో మొదటి రోజే దాదాపు 102 మంది వికలాంగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నిపుణులైన వైద్యుల బృందం లబ్ధిదారులను నిశితంగా పరిశీలించి, వారికి అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, కాఫో (KAFO) పరికరాలు, ట్రైసైకిళ్లు మరియు ఊతకర్రల కోసం కొలతలను సేకరించారు. ఈ కొలతల సేకరణ ప్రక్రియ ఈరోజు (ఏప్రిల్ 28) కూడా కొనసాగుతోంది. పారదర్శకతతో కూడిన ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ అత్యాధునిక జైపూర్ ఫుట్ సాంకేతికతతో కూడిన పరికరాలను అందజేయనున్నారు.

ఈ కార్యక్రమం ప్రధాన ఘట్టం రేపు అనగా ఏప్రిల్ 29న జరగనుంది. గౌరవ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు స్వయంగా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు కృత్రిమ అవయవాలను అందజేయనున్నారు. వికలాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా, స్వయం సమర్థులుగా మారి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్నదే మంత్రి గారి లక్ష్యం. నియోజకవర్గంలోని వికలాంగుల కళ్లలో ఆనందం చూడటమే పరమావధిగా సాగుతున్న ఈ సేవా యజ్ఞం ధర్మవరంలో ఒక సరికొత్త మార్పుకు నాంది పలుకుతోంది.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM

Next Story